కాకినాడలో భారీ అక్రమ రేషన్ బియ్యం సీజ్
కాకినాడ పోర్ట్ వద్ద అధికారులు భారీగా అక్రమ రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నారు. ఐదు లారీలలో రూ.65 లక్షల విలువైన రూ.140 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి విదేశాలకు తరలించేందుకు ప్రయత్నించగా, ఐదు లారీలు సీజ్ చేసి, నిత్యవసర వస్తువుల చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.