నల్గొండలో రేపే జాబ్ మేళా

నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 17 న ఉదయం 10.30 గంటలకు జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులు నేరుగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, బయోడేటాతో జాబ్ మేళా కు హాజరు కావాలన్నారు. అర్హత, వేతనం తదితర పూర్తి వివరాలకు 7893420435 ఫోన్ నంబర్ ను సంప్రదించాలని సూచించారు.