ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే తంగిరాల
NTR: కంచికచర్ల మండలం కీసర గ్రామ దేవతలైన శ్రీ ముత్యాలమ్మ తల్లి, పోతురాజు స్వామి వార్ల దేవస్థాన ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన ప్రాంగణంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు.