VIDEO: హట్యాతండాలో అధ్వానంగా అంతర్గత రోడ్లు..!

WGL: పర్వతగిరి మండలం హట్యాతండా గ్రామ పంచాయతీలో అంతర్గత రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో తండా రోడ్లు నడవడానికి సైతం వీలులేకుండా బురదమయంగా మారాయి. పంచాయతీ ఏర్పడి పదేళ్లు కావొస్తున్నా నేటికీ అంతర్గత రోడ్లను వేసే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపలేదు. వెంటనే తండాలో అంతర్గత రోడ్లను నిర్మించాలని బుధవారం స్థానికులు డిమాండ్ చేశారు.