హైవేపై రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు

E.G: కడియం మండలం పొట్టిలంక వద్ద హైవేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రావులపాలెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమండ్రి వైపు వస్తుండగా పొట్టిలంక వద్ద హైవే రోడ్డు క్లీనింగ్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు కూడా గాయపడ్డారు.