డ్రైనేజీ సమస్యలను పరిశీలించిన మాజీ మున్సిపల్ ఛైర్మన్

MBNR: జడ్చర్ల పట్టణంలోని 8వ వార్డులో జడ్చర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ దోరేపల్లి లక్ష్మీ రవీందర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీని పరిశీలించారు. ట్రైన్ మరమ్మతులకు గురి కావడంతో మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డితో సమస్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో కాంట్రాక్టర్ బాసిత్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.