ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ

NGKL: కల్వకుర్తి మండలం జిడిపల్లి గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం నర్సరీలో పనిచేస్తున్న ఉపాధి కూలీలకు సర్పంచ్ ఆంజనేయులు ఓఆర్ఎస్, గ్లూకోస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేసవికాలంలో ఎండల తీవ్రత వల్ల కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.