ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన ధర కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని, మధ్యవర్తుల జోక్యం లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు ఈ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.