విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ
PDPL: ముత్తారం మండలం శాత్రాజుపల్లి గ్రామంలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో విద్యుత్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, మండల అధ్యక్షుడు బాలాజీ, మాజీ జడ్పీటీసీ జగన్మోహన్ రావు, ఏఈ రాజేంద్ర ప్రసాద్, పాల్గొన్నారు.