'మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే'

MNCL: చెన్నూర్ పట్టణ కేంద్రంలోని పలు వార్డుల్లో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం మున్సిపాలిటీలో ఇంకా జరగాల్సిన అభివృద్ధి పనులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళిని ఆదేశించారు.