VIDEO: ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?

VIDEO: ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా..?

BHPL: టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామ సమీపంలోని విద్యుత్ స్తంభానికి పిచ్చి మొక్కల తీగలు అల్లుకుని విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిస్తున్నాయి. ఈ తీగలతో పశువులు, మనుషులకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ సమస్యపై సంబంధిత అధికారులు త్వరగా స్పందించి తీగలు తొలగించాలని ఇవాళ గ్రామస్తులు డిమాండ్ చేశారు.