CEIR పోర్టల్ సాయంతో 10 ఫోన్ల అప్పగింత

CEIR పోర్టల్ సాయంతో 10 ఫోన్ల అప్పగింత

NZB: బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల పలువురు సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారని ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ వెంకట నారాయణ CEIR పోర్టల్ సాయంతో 10 ఫోన్లను ట్రేస్ చేసి సోమవారం బాధితులకు అందజేశారు. దీంతో బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైన ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.