పామాయిల్ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాందాస్

పామాయిల్ పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాందాస్

KMM: పామాయిల్ సాగు ద్వారా రైతులు సుస్థిరమైన ఆదాయం పొందవచ్చని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. బుధవారం ఏన్కూరులోని ధర్మారావు అనే రైతు సాగు చేస్తున్న పామాయిల్ తోటను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం పామాయిల్ సాగుకు పూర్తి ప్రోత్సాహం అందిస్తోందని, రైతులు అంతర పంటల ద్వారా అదనపు లాభాలు గడించాలని సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.