VIDEO: పోటెత్తిన భక్తులు.. అన్ని దారులు కొండగట్టుకే..
KNR: చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఇవాళ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయంలో మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో భాగంగా లక్షలాదిమంది దీక్షాపరులు వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన అంజన్న క్షేత్రానికి తరలివస్తున్నారు. దీంతో కొండగట్టుకు వెళ్లే ఏ దారి చూసినా కాషాయ వర్ణమే కనిపిస్తోంది. రామనామస్మరణతో మారు మోగుతున్నాయి.