కలెక్టరేట్​లో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు

కలెక్టరేట్​లో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు

NZB: సత్యసాయి బాబా శత జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం NZB కలెక్టరేట్​లో అధికారికంగా వేడుకలు నిర్వహించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని, సత్యసాయి బాబా చిత్రపటానికి పూలమాల వేశారు. సత్యసాయి బాబా జీవిత విశేషాలు, బోధనలు, సేవా నిరతిని గుర్తు చేసుకున్నారు. వేడుకల సందర్భంగా సత్యసాయి బాబా సేవా సమితి ప్రతినిధులు భక్తి గీతాలు ఆలపించారు.