రోటిగడ్డతండాలో సీసీ కెమెరాలు ప్రారంభం

రోటిగడ్డతండాలో సీసీ కెమెరాలు ప్రారంభం

NLG: చింతపల్లి మండలం రోటిగడ్డతండా గ్రామపంచాయతీలో సీఐ రాజు, ఎస్సై యాదయ్యలు కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇస్లావత్ పద్మ పూల్ సింగ్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండ్లపల్లి నర్సింహారెడ్డి తదితరులున్నారు.