సీఎం హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే

సీఎం హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే

KDP: ఈ నెల 1వ తేదీన సామాజిక పెన్షన్ పంపిణీలో భాగంగా సీఎం చంద్రబాబు జమ్మలమడుగు మండలం గూడెం చెరువులోని జగదీష్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా, అక్కడ జగదీష్ కుటుంబ సమస్యలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి ఒక మర మగ్గం కొనిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కాగా, సీఎం హామీ మేరకు రూ.1,50,000 విలువ గల మర మగ్గాన్ని MLA ఆదినారాయణ రెడ్డి జగదీష్‌కు అందించారు.