WAR.. 30కి పైగా వర్సిటీలు ధ్వంసం
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 30కి పైగా వర్సిటీలు దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఉత్తర టెహ్రాన్‌లోని షాహిద్ బెహెష్తీ వర్సిటీతో పాటు మెహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై కూడా దాడి చేశాయని ఇరాన్ మంత్రి సర్రాఫ్ వెల్లడించారు. మరో వైపు ఆసుపత్రులు, పౌర ఆరోగ్య కేంద్రాలపై కూడా విరుచుకుపడ్డాయని తెలిపారు. ఈ దాడుల్లో వేలాది మంది గాయపడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.