మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

మిషన్ భగీరథ కార్మికులకు వేతనాలు చెల్లించాలి

సూర్యాపేట జిల్లా: నూతనకల్ మండలం శిల్పకుంట్ల గ్రామం మిషన్ భగీరథలో పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలు విడుదల చేయాలని,వేతనాలు పెంచాలని ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని నూతనకల్ మండలం చిల్పకుంట్ల మిషన్ భగీరథ ప్లాంట్ ముందు పనులు బంద్ చేసి కార్మికులు ధర్నాకు దిగారు. గత ఐదు నెలల నుండి వేతనాలు రాకపోవడంతో అధికారులకు, కాంట్రాక్టర్ల దృష్టికి తీసుకెళ్లిన స్పందన లేదు.