పర్చూరు సమీపంలో టోల్ వసూళ్లపై నిరసన
BPT: వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారిపై పర్చూరు సమీపంలో టోల్ వసూలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం నాగులపాలెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రహదారి మరమ్మతులు పూర్తికాకుండా, కనీసం సర్వీస్ రోడ్డు కూడా లేకుండా టోల్ వసూలు చేయడం అన్యాయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారిపైకి చేరుకున్న గ్రామస్థులు, తక్షణమే టోల్ వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.