ఈ నెల 10, 11వ తేదీల్లో జాతీయ సెమినార్ నిర్వహణ
ASR: చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం, గురువారం డిజిటల్ ఎడ్యుకేషన్‌పై జాతీయ సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ విజయభారతి మంగళవారం తెలిపారు. పీఎం ఉష పథకంలో భాగంగా రెండు రోజుల పాటు ఈ సెమినార్ నిర్వహిస్తామన్నారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ తదితరులు హాజరవుతారన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.