'పనులు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు'

'పనులు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవు'

VZM: కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద రెండు షాపులకు పునాదులు తవ్విన విషయం తెలిసిందే. ఇవాళ రోడ్లు భవనాల శాఖ అధికారులు ప్రహరీ నిర్మాణానికి పనులు చేపడుతుండగా కొంత మంది వ్యక్తులు పనికి ఆటంకం కల్పించారు. ఈ మేరకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్థలానికి వచ్చి పరిశీలించారు. పనులు యథావిధిగా కొనసాగిస్తామని ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని డీఈ. శ్రీనివాస్ తెలిపారు.