ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం సేకరణకు అడుగులు
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో యాసంగి వరి ధాన్యం సేకరణకు యంత్రాంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు 800కు పైగా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. బోనస్ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైతులు ఇబ్బంది పడకుండా గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యాలను ముందస్తుగా సమకూర్చుకుంటున్నారు.