స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన పారిశుద్ధ కార్మికులు

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి ఆదేశాలనుసారం మంగళవారం పట్టణంలోని 14 వ వార్డులో మున్సిపల్ కార్మికులు పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ మేరకు వార్డులోని డ్రైనేజీ కాలువలను శుభ్రం చేసి, రోడ్డు ఇరువైపులా బ్లీచింగ్ చల్లారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాల భారీగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇంటి పరిసారాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.