మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

మద్యానికి బానిసై యువకుడి ఆత్మహత్య

KMR: బిక్కనూర్ మండలంలోని పెద్దమల్లారెడ్డికి చెందిన మర్రి ప్రవీణ్(24) అనే యువకుడు మద్యానికి బానిసగా మారి, ఇంట్లో డబ్బుల కోసం వేధించేవాడు. కాగా ప్రవీణ్ తన తండ్రిని శుక్రవారం రాత్రి మద్యానికి డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు వెల్లడించాడు.