పెన్షన్లు పంపిణీ చేసిన గంటా
VSP: జీవీఎంసీ 6 వ వార్డు పరిధిలోని లక్ష్మీవానిపాలెంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 63 లక్షల మందికి ప్రతినెల రూ.2,800 కోట్లు పెన్షన్ రూపంలో అందిస్తున్నామని చెప్పారు. కొత్తగా ఈ నెలలో 8 వేల మందికి స్పౌజ్ పెన్షన్లు కింద రూ.3 కోట్లు విడుదల చేశామన్నారు.