తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు
కోనసీమ: గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు త్రాగునీటి ట్యాంకుల నిర్మాణం చేపడుతున్నామని కే. గంగవరం ఎంపీడీవో శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రామారావు తెలిపారు. మండలంలోని శివాల గ్రామంలో సురక్షిత త్రాగునీటి ట్యాంక్ నిర్మాణానికి టీడీపీ నాయకుడు వాసంశెట్టి సత్యంతో కలిసి వారు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.