నిషేధిత ప్లాస్టిక్ తరలిస్తున్న ఆటో పట్టివేత
ASF: కాగజ్‌నగర్ మున్సిపాలిటీ లారీ చౌరస్తా వద్ద అక్రమంగా ఆటోలో తరలిస్తున్న నిషేధిత ప్లాస్టిక్‌ను మున్సిపల్ అధికారులు శుక్రవారం పట్టుకుని, ఆటో సీజ్ చేశారు. కమిషనర్ తిరుపతి ఆదేశాల మేరకు పర్యావరణ ఇంజినీర్ ప్రణీల్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.