మాజీ మంత్రి సమక్షంలో వైసీపీలో చేరిన న్యాయవాదులు
VSP: విశాఖ వైసీపీ కార్యాలయంలో పలువురు న్యాయవాదులు పార్టీలో చేరారు. 32వ వార్డు అధ్యక్షుడు రాజారెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ సమక్షంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పథకాలు అమలు చేయడంలో కూటమి విప్లమైందని కన్నబాబు పేర్కొన్నారు.