తూర్పు సత్రం నూతన ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

BPT: బాపట్ల పట్టణంలో పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రం ఛైర్మన్‌గా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా హాజరై సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం తూర్పు సత్రం తరపున విద్యార్థులకు స్కాలర్షిప్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.