VIDEO: జనగణనపై ఎన్యుమరేటర్లకు శిక్షణ
MBNR: దేశవ్యాప్తంగా 2027లో జరిగే జనగణన కోసం జడ్చర్ల మున్సిపాలిటీలో ఎన్యుమరేటర్ల శిక్షణ శనివారం ప్రారంభమైంది. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో 153 మంది ఎన్యుమరేటర్లు, 25 మంది సూపర్‌వైజర్లకు నాలుగు బ్యాచులుగా మూడు రోజుల పాటు ఈ తరగతులు నిర్వహిస్తున్నారు. వివరాల సేకరణలో పొరపాట్లు లేకుండా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ లక్ష్మారెడ్డి సూచించారు.