టీటీడీ మాజీ AVSO మృతి కేసు.. కీలక విషయాలు
AP: టీటీడీ మాజీ AVSO సతీష్ కుమార్ మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరకామణి కేసులోని ప్రత్యర్థులే హత్య చేశారని.. ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సతీష్ ప్రయాణించిన రైలులో తోటి ప్రయాణికులపై ఆరా తీస్తున్నారు. ప్రయాణికుల లిస్టును పరిశీలిస్తున్నారు. బోగీలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా? ఫాలో చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు.