LDF, UDF అవినీతిలో కూరుకుపోయాయి: మోదీ

LDF, UDF అవినీతిలో కూరుకుపోయాయి: మోదీ

కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న PM మోదీ LDF, UDFలపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని.. కేంద్ర నిధులను LDF లూటీ చేస్తోందని ధ్వజమెత్తారు. BJP అంటే ఈ రెండు పార్టీలకు భయమని ఎద్దేవా చేశారు. అవి కేవలం ఓటు బ్యాంకు పైనే ఫోకస్ పెట్టాయని.. BJPతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్షాలు పొత్తులో ఉన్నాయని మండిపడ్డారు.