'స్వచ్ఛ ఆంధ్రా డే' కార్యక్రమానికి కలెక్టర్..!

'స్వచ్ఛ ఆంధ్రా డే' కార్యక్రమానికి కలెక్టర్..!

ASR: "వాటర్ పాజిటివ్ ఆంధ్ర" లక్ష్యంలో భాగంగా, ప్రతి నెల 3వ వారంలో నిర్వహించే 'స్వచ్ఛ ఆంధ్ర డే' కార్యక్రమాన్ని ఈనెల 18న పెదబయలు మండలం కోడాపల్లి గ్రామంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ నిషాంతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారన్నారు. నీటి సంరక్షణను ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని పేర్కొన్నారు.