VIDEO: ఈనెల 27 నుంచి జగన్మోహిని కేశవ స్వామి కళ్యాణోత్సవాలు
కోనసీమ: ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో వేంచేసి ఉన్న జగన్మోహిని కేశవ స్వామి ఆలయం నందు 27వ తేదీ నుంచి ఏప్రిల్ మూడోవ తేదీ వరకు స్వామివారి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో భగవతుల వెంకటరమణ తెలిపారు. బుధవారం ఓ ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ కళ్యాణోత్సవ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు సాయంత్రం వేళ వాహన సేవలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.