కాల్పుల విరమణ దిశగా ఇరాన్, అమెరికా!
అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలకు పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఈ క్రమంలో 45 రోజుల కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇరాన్, అమెరికాలకు ఆ దేశాలు అందజేసినట్లు సమాచారం. 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా చర్చలు జరిపేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాయి. దీనిపై ఇరాన్, అమెరికా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.