సలేశ్వరం.. భక్తజన సంద్రం
TG: నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వర క్షేత్రంలో లింగమయ్య జాతర వైభవంగా ప్రారంభమైంది. చైత్రపౌర్ణమి సందర్భంగా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దట్టమైన అడవులు, లోయలు, 500 అడుగుల ఎత్తైన జలపాతాల మధ్య సాగే ఈయాత్ర 'దక్షిణ అమర్‌నాథ్'ను తలపిస్తోంది.