పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో

పింఛన్లు పంపిణీ చేసిన ఎంపీడీవో

VSP: కశింకోట మండలం బయ్యవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఎంపీడీవో సీహెచ్ చంద్రశేఖర్ శనివారం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో సచివాలయ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి బయోమెట్రిక్ తీసుకొని పింఛన్లు అందజేసినట్లు తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పింఛన్లు పంపిణీ ప్రారంభించినట్లు తెలిపారు.