రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శలు

రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శలు

TG: దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతీయ అసమానతల పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తున్నారా? అని ఆయన నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే సీఎంకు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు ప్రాంతీయ అసమానతల పేరు చెప్పి చలి కాచుకుంటారని ధ్వజమెత్తారు.