సీఎం పర్యటన స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ ఎస్పీ
WNP: డిసెంబర్ 1న ఆత్మకూరు పట్టణానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. శుక్రవారం జిల్లా అడిషనల్ ఎస్పీ వీరారెడ్డితో పాటు ఇతర అధికారులు సీఎం పర్యటన కోసం హెలీపాడ్ స్థలాన్ని, బహిరంగ సభ నిర్వహించే జాతర మైదానం, జూరాల గ్రామ సమీపంలోని ప్రదేశాలను పరిశీలించారు.