రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
KDP: వల్లూరు మండలం ఈత చెట్టు సమీపంలో కడప-తాడిపత్రి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ ఎదురుగా ఆటో-ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల వివరాలు ఇంకా తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.