పాఠశాలను తనిఖీ చేసిన ఏపీ ఆహార కమిషన్ సభ్యురాలు

పాఠశాలను తనిఖీ చేసిన ఏపీ ఆహార కమిషన్ సభ్యురాలు

ప్రకాశం: పొదిలి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలిక పాఠశాలను గురువారం ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాలా దేవి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలని అధికారులకు సూచించారు. వెజిటేబుల్ పలావ్, రాగిజావ తయారీ విధానాన్ని వంటవాళ్లను అడిగి తెలుసుకున్నారు.