నిజాంసాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టింది. మంగళవారం రాత్రి 8 గంటలకు 9,570 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 వరద గేట్లను ఎత్తి 9,570 క్యూసెక్కుల నీటిని మంజీరాకు విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ సాకేత్ తెలిపారు. పూర్తి స్థాయి నీటి నిల్వ17.802 టీఎంసీలకు గాను, ప్రస్తుతం ప్రాజెక్టులో 17.802 టీఎంసీలతో నిండుకుండలా మారినట్లు తెలిపారు.