'NH-65ను గొల్లపూడి వరకు విస్తరించండి'

NTR: అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే-65ను గొల్లపూడి వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విస్తరణను కంచికచర్ల వరకే పరిమితం చేయాలని ఎన్‌హెచ్ఏఐ భావిస్తోంది. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్‌లో అమరావతి ఓఆర్‌ఆర్ వరకు విస్తరణ ప్రతిపాదించడంతో ఈ మేరకే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ పరిశీలిస్తోంది.