పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: SP
VKB: పంచాయతీ ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు యంత్రాంగాన్ని రంగంలోకి దించి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమన్వయంతో పనిచేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలన్నారు.