'ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజాదర్బార్'
ELR: సమస్యల రహిత నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని శుక్రవారం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగంలో నిలుపుతానని వెల్లడించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజాదర్బార్ దోహదపడుతుందన్నారు.