కావాలనే నన్ను ఇరికించారు: మంగ్లీ
HYD: సింగర్ మంగ్లీ సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేసింది. 'మైక్రో ఫైనాన్స్, శుభక్షేత్ర ఇన్ఫ్రా మోసాలతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. బాధితులకు అన్యాయం జరిగింది. వారికి న్యాయం జరగాలని నేను ఆశిస్తున్నా. వారికి అండగా ఉంటా. కొందరు వ్యక్తులు, శక్తులు నాపై పనికట్టుకొని కుట్ర పన్నుతున్నారు. న్యాయవ్యవస్థ, చట్టంపై నాకు సంపూర్ణ నమ్మకం, గౌరవం ఉంది' అని పేర్కొన్నారు.