VIDEO: ప్రచారంలో సందడి చేసిన హిజ్రాలు
KNR: మానకొండూర్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల సందర్భంగా హిజ్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి దావు సుజాత-సంపత్ రెడ్డి నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న హిజ్రాలు అభ్యర్థికి ప్రత్యేక పూజలు చేసి, డప్పుల శబ్దాలు, నృత్యాలతో ఆశీర్వదించారు.