రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్యాయత్నం

NZB: రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో రైలుకు ఎదురుగా వెళ్లి యువకుడు సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సాలూర మండలం ఖాజాపూరికి చెందిన పవన్ (28) నిజామాబాద్‌లో ఉంటూ బెట్టింగ్, తాగుడుకు బానిస అవ్వడంతో అప్పులు ఎక్కువై మనస్తాపంతో రైలుకు ఎదురు వెళ్లి ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్ర గాయాలతో పడి ఉండగా స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.