రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NLR: వింజమూరులోని కాశీనాయన ఆశ్రమం వద్ద బైక్, పాలవ్యాన్ ఢీకొన్న ఘటన బుధవారం రోజున చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తురకపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతను చంద్రపడియ వద్ద ఉన్న కెమికల్ ఫ్యాక్టరీకు విధులకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.